Kishan Reddy: రాష్ట్రంలో మార్పు బీజేపీతో సాధ్యం
Kishan Reddy: రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్
Kishan Reddy: రాష్ట్రంలో మార్పు బీజేపీతో సాధ్యం
Kishan Reddy: తెలంగాణ ప్రజలు పాలనలో మార్పు కోరుకుంటున్నారనీ.. ఆమార్పు బీజేపీతోనే సాధ్యమని అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. టీఆర్ఎస్ పార్టీ అభద్రతా భావంలో పడిపోయిందన్న ఆయన.. ఓ ముఖ్యమంత్రి కూతురిని బంధువులను ఓడించిన ఘనత బీజేపీదేనని గుర్తు చేశారు. అయితే సీఎం కేసీఆర్ చెబుతున్నట్లు ఫామ్ హౌజ్ ఫైల్స్ కు భయపడే ప్రసక్తే లేదన్నారు. కేసీఆర్ తప్పులు చేశారు కాబట్టే, ఈడీ, సీబీఐ రాష్ట్రానికి రాకుండా జీవోలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో త్వరలో అన్ని వివరాలో హైదరాబాద్ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోమున్నామని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి.