Khammam: ఉదయం జిమ్‌కు వెళ్లొచ్చాక గుండెపోటు.. కాంగ్రెస్ నేత కుమారుడి మృతి

Khammam: ఛాతిలో నొప్పి వస్తుందని చెబుతూనే కుప్పకూలిన శ్రీధర్

Update: 2023-07-10 06:59 GMT

Khammam: ఉదయం జిమ్‌కు వెళ్లొచ్చాక గుండెపోటు.. కాంగ్రెస్ నేత కుమారుడి మృతి

Khammam: గుండెపోట్లు యువతను ఠారెత్తిస్తున్నాయి. ఉన్నట్లు ఉండి కుప్పకూలడం... ఆస్పత్రికి తరలించేలోపే మృత్యువాత పడటం వంటి ఘటనలు పెరుగుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు వరుసగా యువతే హార్ట్ స్ట్రోక్‌కు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. ఖమ్మం మాజీ మార్కె్ట్ కమిటీ చైర్మన్ రాధా కిషోర్ ఇంట్లో విషాదం చో టు చేసుకుంది. రాధా కిషోర్ కొడుకు శ్రీధర్ గుండెపోటుతో మృతి చెందాడు. ఉదయం జిమ్‌కు వెళ్లిన శ్రీధర్ ఒంట్లో కాస్త శుస్తిగా ఉందని ఇంటికి వచ్చేశాడు. ఛాతిలో నొప్పి వస్తుందని చెబుతూనే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినా... ఫలితం లేకపోయింది. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

Tags:    

Similar News