Khairatabad Ganesh Idol Creation Work Starts: ఖైరతాబాద్‌ గణేశ్‌ విగ్రహ తయారీ పనులు ప్రారంభం..ధన్వంతరి నారాయణుడిగా దర్శనం

Khairatabad Ganesh Idol Creation Work Starts: ప్రతి ఏడాది వైభవంగా నిర్వహించే ఖైరతాబాద్‌ మహాగణపతి తయారీ పనులను ఈ ఏడాది కూడా మొదలు పెట్టారు. బుధవారం ఉదయం 11గంటలకు ఈ విశిష్ట గణపతి తయారీ పనులను ప్రారంభించిన్నట్లు ఖైరతాబాద్‌ మహాగణపతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్‌

Update: 2020-08-05 08:59 GMT
ధన్వంత్రి నారాయణ మహా గణపతి

Khairatabad Ganesh Idol Creation Work Starts: ప్రతి ఏడాది వైభవంగా నిర్వహించే ఖైరతాబాద్‌ మహాగణపతి తయారీ పనులను ఈ ఏడాది కూడా మొదలు పెట్టారు. బుధవారం ఉదయం 11గంటలకు ఈ విశిష్ట గణపతి తయారీ పనులను ప్రారంభించిన్నట్లు ఖైరతాబాద్‌ మహాగణపతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్‌ తెలిపారు. ఈ ఏడాది మహావిష్ణువు రూపంలో ఖైరతాబాద్ వినాయకుడు దర్శనం ఇవ్వనున్నాడు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో 2020 సంవత్సరానికి గాను ఖైరతాబాద్‌ మహాగణపతిని కేవలం 9 అడుగుల ఎత్తులో మట్టితో తయారుచేస్తున్నామని కమిటీ అధ్యక్షలు తెలిపారు.

66వ ఏట రూపొందిస్తోన్న ఖైరతాబాద్ గణనాథుడికి శ్రీ ధన్వంతరి నారాయణ మహా గణపతిగా నామకరణం చేశారు. ఈ విగ్రహానికి ఓ వైపు లక్ష్మీదేవి మరో వైపు సరస్వతి దేవి విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ విగ్రహాలు మట్టితో తయారు చేసి, అదే ప్రదేశంలో నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యావరణ హితంగా ఖైరతాబాద్ గణనాథుడిని రూపొందిస్తున్నారు. కరోనా ప్రభావంతో భక్తులు ఎవరూ రావద్దని.. ఆన్ లైన్ ద్వారా దర్శనం చేసుకోవాలని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ విజ్ఞప్తి చేసింది.

ఇక ప్రతి ఏడాది అగస్టు నెల వచ్చిందంటే చాలు నగరం అంతా వినాకుల మండపాలతో, సందళ్లతో నిండిపోయేది. కానీ ఈ ఏడాది కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండడంతో అన్ని పండగలను ఇండ్లలోనే చేసుకున్నట్టు ఆ గణనాధుని కూడా ఇండ్లలోనే నిలుపుకుని పూజించాలని అధికారులు తెలుపుతున్నారు. 

Tags:    

Similar News