ఖైరతాబాద్‌ మహా గణపతి సిద్ధమవుతున్నాడు

ఖైరతాబాద్‌ మహా గణపతి సిద్ధమవుతున్నాడు
x
Highlights

వినాయక చవితి పండుగ అనగానే తెలంగాణ ప్రజలకు టక్కున గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేషుడు. ప్రతి ఏడాది భిన్నమైన రూపాల్లో భక్తులకు దర్శనమిస్తూ ఆకట్టుకుంటాడు...

వినాయక చవితి పండుగ అనగానే తెలంగాణ ప్రజలకు టక్కున గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేషుడు. ప్రతి ఏడాది భిన్నమైన రూపాల్లో భక్తులకు దర్శనమిస్తూ ఆకట్టుకుంటాడు ఖైరతాబాద్ గణేషుడు. ఈ ఏడాది భక్తులకు అనుగ్రహం ఇచ్చేందుకు సిద్దమవుతున్నాడు ఖైరతాబాద్ గణేశ్. ఈ ఏడాది మహాగణపతిని 55 నుంచి 60 అడుగుల ఎత్తులో తీర్చి దిద్దనున్నట్లు ఖైరతాబాద్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్, శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్‌ తెలిపారు. మంగళవారం సర్వేకాదశి సందర్భంగా ఖైరతాబాద్ గణేష్ మండపం దగ్గర గణనాథుడి విగ్రహ నిర్మాణ పనులు కర్ర పూజతో ప్రారంభమయ్యాయి. ఈ సారి ఎత్తు తగ్గించమని విన్నపాలు వస్తున్న నేపథ్యంలో త్వరలో ఉత్సవ కమిటీ ఓ నిర్ణయం తీసుకోబోతున్న‌ట్లు తెలిసింది. నాలుగు నెలల పాటు విగ్రహ తయారీ పనులు జరగనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories