Kesamudram Municipal Election Results 2026: కేసముద్రంలో హోరాహోరీ: మున్సిపల్ ఫలితాల్లో ‘టై’.. చెరో 8 స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ విజయం!
Kesamudram Municipal Election Results 2026: మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు పతాక స్థాయి ఉత్కంఠను రేకెత్తించాయి.
Kesamudram Municipal Election Results 2026: మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు పతాక స్థాయి ఉత్కంఠను రేకెత్తించాయి. ఇక్కడ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ (మ్యాజిక్ ఫిగర్) రాకపోవడంతో మున్సిపల్ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
బలాబలాలు సమానం:
కేసముద్రం మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉండగా, ఫలితాలు ఇరు ప్రధాన పార్టీల మధ్య సమానంగా పంపిణీ అయ్యాయి:
కాంగ్రెస్: 08 వార్డులు
బీఆర్‌ఎస్: 08 వార్డులు
మెజారిటీకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 9 కాగా, ఇరు పార్టీలు 8-8 స్థానాల వద్దే నిలిచిపోయాయి. దీంతో ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఎంపికలో ఇప్పుడు ఎక్స్-అఫీషియో ఓట్లు అత్యంత కీలకంగా మారాయి. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పార్టీలు పీఠాన్ని దక్కించుకునేందుకు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. ఫలితాల అనంతరం ఇరు పార్టీల కార్యకర్తలు తమ అభ్యర్థుల విజయాలను వేర్వేరుగా వేడుక చేసుకున్నప్పటికీ, పీఠం ఎవరికి దక్కుతుందనే దానిపై పట్టణంలో ఉత్కంఠ కొనసాగుతోంది.