KCR: యశోద ఆసుపత్రిలో చేరిన కేసీఆర్‌

KCR: భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మరోసారి యశోద ఆసుపత్రిలో చేరారు.

Update: 2025-07-10 06:39 GMT

KCR: యశోద ఆసుపత్రిలో చేరిన కేసీఆర్‌

KCR: భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మరోసారి యశోద ఆసుపత్రిలో చేరారు. వైద్యుల సలహా మేరకు ఆయన సోమాజిగూడలోని ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం కేసీఆర్‌కు వైద్యులు తగిన పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఈ నెల 3న కూడా కేసీఆర్ యశోద ఆసుపత్రిలో చేరారు. అప్పట్లో బ్లడ్ షుగర్, సోడియం స్థాయులు మానిటర్ చేయడం కోసం వైద్యులు రెండు రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాలని సూచించారు. ఆరోగ్యం మెరుగుపడటంతో జులై 5న డిశ్చార్జి చేశారు. అయితే, వారం రోజుల విశ్రాంతి తీసుకోవాలని, ఆ తర్వాత మరోసారి పరీక్షలు చేయాలని వైద్యులు సూచించారు.

వైద్యుల సూచనల మేరకు, తదుపరి పరీక్షల కోసం కేసీఆర్ మళ్లీ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందం పర్యవేక్షిస్తోంది.

Tags:    

Similar News