Ponnam Prabhakar: పదేళ్లలో బీఆర్ఎస్ కరీంనగర్ కార్పొరేషన్ కు చేసిందేమీ లేదు

Ponnam Prabhakar: పదేళ్ల బీఆర్ఎస్ హయంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు చేసిందేమీ లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.

Update: 2026-02-09 07:20 GMT

Ponnam Prabhakar: పదేళ్ల బీఆర్ఎస్ హయంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు చేసిందేమీ లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కాంగ్రెస్ హయాంలోనే కరీంనగర్ అభివృద్ధి చెందిందన్నారు. కాళ్ల చెఫ్పులు అరిగేలా తిరిగినా బీఆర్ఎస్ పాలనలో అర్హులకు రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు.

ప్రజాపాలనలో పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్, బీజేపీ లోపాయికారి ఒప్పందం చేసుకుని ముందుకు పోతున్నారని ఆరోపించారు. అవినీతి మరకలు ఉన్న వారిని కేంద్ర మంత్రి బండి సంజయ్ బీజేపీలో చేర్చుకున్నారని విమర్శించారు. అవినీతికి,నిజాయితీకి‌ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని.. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు.

Full View


Tags:    

Similar News