Suicide: ప్రియురాలితో వీడియో కాల్‌ మాట్లాడుతూ బాలుడి ఆత్మహత్య..!

Suicide: బాలికతో వీడియో కాల్ మాట్లాడుతూ ఓ బాలుడు ఉరి వేసుకుని మృతి చెందాడు.

Update: 2026-02-09 09:56 GMT

Suicide: బాలికతో వీడియో కాల్ మాట్లాడుతూ ఓ బాలుడు ఉరి వేసుకుని మృతి చెందాడు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ సమీపంలో ఘటన జరిగింది. బోడుప్పల్ అయ్యప్ప దేవాలయం సమీపంలో ఓ ప్రైవేటు ఉద్యోగి కుమారుడు గవర్నమెంట్ ఐటీఐ కాలేజీలో రెండవ సంవత్సరం చదువుతున్నాడు. మేడిపల్లి మహీంద్ర కార్ల షోరూంలో ప్రాక్టికల్ ట్రైనింగ్‌లో ఉన్నాడు. బాలుడి పేరెంట్స్‌ షాపింగ్ కోసం బయటకు వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలుడు...తన ప్రియురాలికి వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని బెదిరించాడు.

చున్నీతో బాలుడు ఉరి వేసుకోవడం చూసిన బాలిక..వెంటనే అతని స్నేహితులకు సమాచారం అందించింది. స్నేహితులు వెంటనే బాలుని ఇంటికి చేరుకుని...తలుపులు బలవంతంగా తెరిచి...అతడిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలిచారు. అప్పటికే బాలుడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  

Tags:    

Similar News