Kaushik Reddy: గులాబీ తీర్థం పుచ్చుకున్న కౌశిక్ రెడ్డి
Kaushik Reddy: టీపీసీసీ మాజీ కార్యదర్శి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు.
Kaushik Reddy: గులాబీ తీర్థం పుచ్చుకున్న కౌశిక్ రెడ్డి
Kaushik Reddy: టీపీసీసీ మాజీ కార్యదర్శి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. సీఎం కేసీఆర్ గులాబీ కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కౌశిక్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ సాధన కోసం పలువురు పని చేశారన్నారు సీఎం కేసీఆర్. ప్రొపెసర్ జయశంకర్ సలహాలతో ఉద్యమాన్ని నడిపించామన్నారు.
ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఉద్యమం కొనసాగించినట్లు కేసీఆర్ గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో పార్టీలు ఓడడం గెలవడం నిరంతర ప్రక్రియ. శాశ్వతంగా ఎవరూ అధికారంలో ఉండరు ఇది రాచరిక వ్యవస్థ కాదు అని తెలిపారు. కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న కౌశిక్ రెడ్డి ఉప ఎన్నిక నేపథ్యంలో పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.