జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్

Update: 2021-02-05 08:46 GMT

Karimnagar Police Training Centre

జాతీయ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకుంది కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఇప్పటికే పలు ప్రయోగాలతో ట్రైనింగ్ సెంటర్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు మరోసారి ప్రత్యేకతను చాటుకుంటున్న కరీంనగర్ పీటీసీ.

కరీంనగర్ పోలీస్ శిక్షణ కేంద్రం వినూత్నమైన ప్రయోగాలతో జాతీయ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకుంటోంది. 2010లో ప్రారంభమైన కరీంనగర్ పీటూసీ ఎన్నో ఆధునిక సౌకర్యాలన్నీ కలిగి ఉంది. ఆధునాతన పద్దతులతో సిబ్బంది ఎంతో మందిని నిష్ణాతులుగా మార్చింది కరీంనగర్ పీటీసీ

ఇప్పుడు జాతీయ స్థాయిలో దక్షిణ భారత జోన్‌ అత్యుత్తమ పోలీస్ శిక్షణ కేంద్రంగా కేంద్ర హోం మంత్రి ట్రోఫిని సొంతం చేసుకుంది. 2018-19 సంవత్సరానికి గానూ ఈ అవార్డుకు కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఎంపిక అయింది.

సుమారు వెయ్యి మందికి ఏకకాలంలో శిక్షణ ఇవ్వగల సామర్థ్యం కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్‌కు ఉంది. ఇండోర్, అవుట్ డోర్ విభాగాల్లో సాధించిన ఫలితాలను దృష్టిలో ఉంచుకుని ఈ ట్రోఫీ కి కరీంనగర్ శిక్షణ కేంద్రం ఎంపిక అయింది.

కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో రెండు గ్రౌండ్స్ ఇండోర్ ట్రైనింగ్ కోసం 10 క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్స్ అలాగే యుద్ధ విద్యలో నైపుణ్యం కోసం అబ్సిటికల్స్ ఏర్పాటు చేసారు. క్రీడల్లో కూడా రాణించేందుకు వాలీబాల్, ఫుట్‌బాల్ కోర్టులు ఏర్పాటు చేసారు.

ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య శిక్షణ ఇవ్వడం కరీంనగర్ పీటూసీ ప్రత్యేకతని అధికారులు అంటున్నారు. చుట్టూ పచ్చదనం చిన్న చిట్టడివిలా ఉండే చెట్లు పోలీస్‌లు స్వయంగా ఏర్పాటు చేసుకున్న చేపల చెరువు ఇవన్నీ కలిసి ఈ పురస్కారానికి ఎంపిక చేసిందంటున్నారు.

Tags:    

Similar News