Bandi Sanjay : కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..

Bandi Sanjay : పాకిస్తాన్ ఓడిపోవడంతో కొందరు బాధపడుతున్నారు కొందరు షాపింగ్ మాల్స్‌పై పాకిస్తాన్ జెండాలు ప్రదర్శిస్తున్నారు

Update: 2023-10-15 03:11 GMT

Bandi Sanjay : కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. 

Bandi Sanjay : కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌పై భారత్‌ విజయంతో సంబరాలు జరిపిన బండి సంజయ్‌.. కొందమంది మూర్ఖులు పాకిస్తాన్ ఓడిపోవడంతో బాధపడుతున్నారన్నారు. అలాంటి వాళ్లకు గతంలో కరీంనగర్‌లో వీపులు సాఫ్‌ చేశామని గుర్తుంచుకోవాలన్నారు బండి సంజయ్. హైదరాబాద్‌లో కొందరు షాపింగ్ మాల్స్ పేరుతో పాకిస్తాన్ జెండాలు ప్రదర్శిస్తున్నారని అలాంటి షాపింగ్ మాల్స్‌పై దాడులు చేస్తామన్నారు. షాపింగ్ మాల్‌ పేరుతో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. దేశభక్తి విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదన్నారు బండి సంజయ్.

Tags:    

Similar News