కామారెడ్డి ఘటన.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై కేసు
*కామారెడ్డి కలెక్టరేట్ ముట్టడిపై బీజేపీ, కాంగ్రెస్ నేతలపై కేసులు
కామారెడ్డి ఘటన.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై కేసు
Kamareddy: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై కేసు నమోదైంది. కామారెడ్డి కలెక్టరేట్ ముట్టడి ఘటనలో బీజేపీ, కాంగ్రెస్ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. బండి సంజయ్, రఘునందన్‌రావు, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డితో పాటు రైతు జేఏసీ నేతలపైనా కేసులు నమోదయ్యాయి. కామారెడ్డిలో ఆందోళనలపై దేవునిపల్లి పీఎస్‌లో మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి.