Farmers Protest: కలెక్టర్ తీరుపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేసినా అదే పరిస్థితి

* కామారెడ్డి రైతుల ఆందోళనపై ఇంకా స్పందించని అధికారులు

Update: 2023-01-05 12:45 GMT

కలెక్టర్ తీరుపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేసినా అదే పరిస్థితి

Kamareddy: కామారెడ్డి రైతుల ఆందోళనపై అధికారులు ఇంకా స్పందించ లేదు. రాత్రి కూడా ఆందోళన కొనసాగించేందుకు రైతులు నిర్ణయించారు. ఇందులో భాగంగానే కలెక్టరేట్ ముందు టెంట్‌లు ఏర్పాటు చేసుకుంటున్నారు. కలెక్టర్ వచ్చే దాకా ఆందోళన విరమించేది లేదని రైతులు తేల్చి చెబుతున్నారు. మంత్రి కేటీఆర్ కలెక్టర్ తీరుపై సీరియస్ అయిన తర్వాత కూడా మార్పు కనిపించడంలేదు. ఇక కాసేపట్లో బీజేపీ నేతలు రైతులకు సంఘీభావం తెలపనున్నారు. ఇందులో భాగంగా.. ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఎంపీ ధర్మపురి అర్వింద్ కామారెడ్డి కలెక్టరేట్‌కు చేరుకోనున్నారు.

Tags:    

Similar News