Kamareddy Municipal Results 2026: కామారెడ్డిలో కాంగ్రెస్ జోరు: బిచ్కుంద, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలు కైవసం.. చెరో 10 వార్డుల్లో ‘హస్తం’ విక్టరీ!
Kamareddy Municipal Results 2026: కామారెడ్డి జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది.
Kamareddy Municipal Results 2026: కామారెడ్డి జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. ముఖ్యంగా బిచ్కుంద మరియు ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ప్రభంజనం సృష్టించి మున్సిపల్ పీఠాలను దక్కించుకున్నారు. రెండు మున్సిపాలిటీల్లోనూ ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు గట్టి షాక్ తగిలింది.
బిచ్కుంద ఫలితాలు:
బిచ్కుంద మున్సిపాలిటీలోని మొత్తం 12 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది.
కాంగ్రెస్: 10 వార్డులు
బీఆర్ఎస్: 01 వార్డు
ఇతరులు: 01 వార్డు
12 స్థానాల్లో 10 గెలుచుకోవడంతో బిచ్కుంద పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమైంది.
ఎల్లారెడ్డి ఫలితాలు:
ఎల్లారెడ్డిలోనూ ఇదే తరహా ఫలితాలు పునరావృతమయ్యాయి. ఇక్కడ కూడా కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
కాంగ్రెస్: 10 వార్డులు
బీఆర్ఎస్: 01 వార్డు
ఇతరులు: 01 వార్డు
మొత్తం 12 వార్డుల్లో 10 చోట్ల విజయం సాధించి ఎల్లారెడ్డి మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
ఈ రెండు మున్సిపాలిటీల్లో భారీ విజయం సాధించడంతో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.