రాజీనామా ఆమోదం కోరేందుకు మండలికి వచ్చాను: కవిత
Kalvakuntla Kavitha: కల్వకుంట్ల కవిత రాజీనామాపై రాజకీయ చర్చలు కొనసాగుతున్నాయి.
Kalvakuntla Kavitha: కల్వకుంట్ల కవిత రాజీనామాపై రాజకీయ చర్చలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత, కవిత శాసన మండలి సభ్యత్వం, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆమె రాజీనామా లేఖను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి సమర్పించారు. అయితే చైర్మన్ ఆ రాజీనామాను ఇంకా ఆమోదించలేదు. దీనిపై తాజాగా కవిత మళ్లీ మండలి చైర్మన్ని కలిసి తన రాజీనామాని ఆమోదించాలని కోరారు.