Kalvakuntla Kavitha: మాణిక్యం ఠాగూర్ కు కవిత కౌంటర్
Kalvakuntla Kavitha: అసోం సీఎం వ్యాఖ్యలపై రాహుల్ కు అండకా కేసీఆర్
Kalvakuntla Kavitha: మానిక్కం ఠాగూర్ కు కవిత కౌంటర్
Kalvakuntla Kavitha: టీ-కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజా పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, అంతే తప్ప ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల కాదన్నారు. అహింసా మార్గంలో కేసీఆర్ చేసిన పోరాటంలో ప్రజలంతా కలిసి రావడం, ఆనాడు ప్రభుత్వంలో ఉన్న మీపై ఒత్తిడి పెరగడం వల్లే తెలంగాణ ఇచ్చారు కానీ ఎవరి భిక్షనో, దయాదాక్షిణ్యాల మీదనో ఇవ్వలేదన్నారు. అసోం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ అనరాని మాటలంటే కెసిఆర్ రాహుల్ గాంధీకి అండగా నిలబడ్డారని కొనియాడారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసేముందు ఆలోచించాలని హితవు పలికారు.