Himanshu: మా తాత కేసీఆర్‌ స్ఫూర్తితోనే కేశవనగర్ పాఠశాలను దత్తత తీసుకున్నాం

Himanshu: కేశవనగర్ పాఠశాలను పున‌:ప్రారంభించిన హిమాన్షు

Update: 2023-07-12 12:19 GMT

Himanshu: మా తాత కేసీఆర్‌ స్ఫూర్తితోనే కేశవనగర్ పాఠశాలను దత్తత తీసుకున్నాం

Himanshu: తన తాత కేసీఆర్‌ స్ఫూర్తితోనే కేశవ నగర్‌ పాఠశాలను దతత్త తీసుకున్నానని తెలిపాడు మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు. కమ్యునిటీ యాక్షన్ సర్వీసెస్‌ టీమ్‌ ద్వారా పాఠశాలను అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దిన కేశవనగర్ పాఠశాలను ఇవాళ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి పున‌: ప్రారంభించాడు హిమాన్షు. కేశవనగర్ పాఠశాలకు వచ్చిన తొలినాళ్లలో స్కూల్‌లో పరిస్థితులను చూసి కళ్లల్లో నీళ్లు తిరిగాయన్నాడు.

అందుకే స్కూల్‌కి ఏదైనా చేయాలని నిర్ణయించి పాఠశాలలో సౌకర్యాలు కల్పించామన్నాడు. తన తాత కేసీఆర్‌ ఆశీస్సులు, తండ్రి కేటీఆర్ స్ఫూర్తితో పాఠశాల పనులను చేయగలిగామని తెలిపాడు హిమాన్షు. పాఠశాల ప్రారంభం అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశాడు.

Tags:    

Similar News