లోకోపైలట్ చంద్రశేఖర్ మృతి

కాచిగూడ రైల్వే‌స్టేషన్ వద్ద హంద్రీ ఎక్స్‌ప్రెస్‌ను ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టిన ఘటనలో లోకోఫైలట్ చంద్రశేఖర్(35 ) శనివారం మృతి చెందారు

Update: 2019-11-17 05:37 GMT
MMTS loco pilot Chandrasekhar dies

కాచిగూడ రైల్వే‌స్టేషన్ వద్ద హంద్రీ ఎక్స్‌ప్రెస్‌ను ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో లోకో- పైలట్ చంద్రశేఖర్ తో పాటు 18 మంది గాయపడ్డారు. నవంబర్ 11 సోమవారం ఉదయం 10.40 ప్రాంతంలో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన లోకోఫైలట్ చంద్రశేఖర్ శనివారం మృతి చెందారు. ఈ ప్రమాదం జరినప్పుడు ఎంఎంటీఎస్ రైలు ఇంజిన్‌లోకో ఫైలట్ చంద్రశేఖర్ ఇరుక్కుపోయాడు. దాదాపు ఆయన్ని రైల్లో నుంచి బయటకు తీయడానికి ఏనిమిది గంటల పాటు రైల్వే సిబ్బంది శ్రమించారు. ఆయన్ని బయటకు తీసిన రైల్వే సిబ్బంది నాంపల్లిలోని కేర్ ఆస్పత్రికి తరలించారు.

అయితే గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించింది. కిడ్నీ, లివర్ దెబ్బతిన్నాయని, రక్తనాళాలు పూర్తిగా దెబ్బతిని, రక్తప్రసరణ నిలిపోయిదని కేర్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆరోగ్యం విషమంగా మారడంతో వారం రోజులుగా ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందించారు. రెండు రోజుల క్రితం కూడి కాలును వైద్యులు తొలిగించారు. కాగా.. శనివారం రాత్రి లోకో పైలెట్- చంద్రశేఖర్ గుండెపోటు వచ్చి ఆస్పత్రితోనే మృతిచెందారు. చంద్రశేఖర్ మృతి చెందిన వార్త తెలుసుకున్న దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. 



ఈ వార్తను  ఆంగ్లములో చదవేందుకు ఇక్కడ క్లిక్ చేయండి 

Tags:    

Similar News