Kalvakuntla Kavitha: కేసీఆర్ అసెంబ్లీకి వస్తేనే..బీఆర్ఎస్ పార్టీ బతికి బట్టకడుతుంది
Kalvakuntla Kavitha: అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కావాలని.. సభకు వచ్చి మాట్లాడితే.. బీఆర్ఎస్ పార్టీ బతికి బట్టకడుతుందని కవిత అన్నారు.
Kalvakuntla Kavitha: అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కావాలని.. సభకు వచ్చి మాట్లాడితే.. బీఆర్ఎస్ పార్టీ బతికి బట్టకడుతుందని కవిత అన్నారు. లేకపోతే పార్టీకి మనుగడ లేదని.. అథోగతి అవుతుందన్నారు. సీఎం రేవంత్... కేసీఆర్ను ఉరివేయమని అనటం కరెక్ట్ కాదని తెలిపారు. ఉద్యమ నాయకుడిపై అలా ఎలా మాట్లాడతారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయంటూ చిట్ చాట్లో కవిత వ్యాఖ్యానించారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ బీఆర్ఎస్ తప్పిదమేనని.. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా జూరాలకు మార్చ వచ్చు కదా అని కవిత ప్రశ్నించారు. హరీష్ రావు ప్యాకేజీలకు అమ్ముడుపోయాడని ఆమె ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ప్రజల్ని పిచ్చి వాళ్లను చేస్తున్నాయని విమర్శించారు. సెప్టెంబర్ 3న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినా.. ఇంత వరకు తన రాజీనామాను ఆమోదించలేదన్నారు కవిత. ఎందుకు ఆమోదించలేదని అడగడానికే ఇవాళ మండలికి వచ్చినట్లు చెప్పారు కవిత.