తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ నింపిన రాహల్ పర్యటన
Congress: ఇదే జోష్ కొనసాగితు హస్తం పార్టీ అధికారంలోకి వస్తుందంటోన్న విశ్లేషకులు
తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ నింపిన రాహల్ పర్యటన
Congress: తెలంగాణలో రాహల్ పర్యటన కాంగ్రెస్‌లో జోష్ నింపింది. సభలు, ర్యాలీలు, సందర్శనలతో రాహుల్ పర్యటన కొనసాగగా ఇదే జోష్ కొనసాగిస్తే హస్తం పార్టీ మరింత బలోపేతం అవుతుందనే టాక్ వినిపిస్తోంది. మూడురోజుల పాటు తెలంగాణలో పర్యటించిన రాహుల్ గాంధీ.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు కాంగ్రెస్ గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. కేవలం సభలకే పరిమితం కాకుండా వినూత్న రీతిలో పర్యటన చేశారు రాహుల్.
తొలిరోజు మంగళవారం కొల్లాపూర్ సభలో రాహుల్ ప్రసంగించిన రాహుల్.. బీఆర్ఎస్ వైఫల్యాలు, కాళేశ్వరం ప్రాజెక్టు టార్గెట్‌గా ప్రసంగించారు చేసారు. తెలంగాణ లో కాంగ్రెస్ అధికారం లోకి రావడం ఖాయమన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలు ఒక్కటే అనే విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ అంశాన్ని రాహుల్ సక్సెస్‌ఫుల్‌గా ఎస్టాబ్లిష్ చేయగలిగారు. ఇక రెండో రోజు మహబూబ్ నగర్ జిల్లాలో రాహల్ పర్యటన సాగింది.
రెండో రోజు కల్వకుర్తి, జడ్చర్ల, షాద్ నగర్‌లలో పర్యటించిన రాహుల్.. భిన్నవర్గాల ప్రజలతో కలుస్తూ పాదయాత్ర చేసారు. ర్యాలీలు చేపట్టారు. కల్వకుర్తి సభా వేదికగా వచ్చే ఎన్నికల్లో దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు పోటీ జరుగుతుందని.. ఈ ఎన్నికల యుద్దంలో కాంగ్రెస్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు రాహుల్. అంతేకాదు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే.. ఇక్కడి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేది కూడా కాంగ్రెసే అనే విషయాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు రాహుల్. అంతకుముందు పార్టీ సీనియర్లతో రాహుల్ భేటీ అయ్యారు. ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించారు. బీజేపీ నేత మాజీ ఎంపీ వివేక్ వెంకట్ స్వామిని కన్విన్స్ చేసి పార్టీలో జాయిన్ అయ్యేలా చేశారు.
ఇలా రాహుల్ తన పర్యటనల్లో కొత్త పంథాలో సాగుతున్నారు. సభలకే పరిమితం కాకుండా ప్రజలను కలుస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇటీవల తన పర్యటనలో టిఫిన్ సెంటర్లు, టీ స్టాల్స్ నిర్వహించే వ్యక్తులను కలిసిన రాహుల్.. ఈ పర్యటనలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాన్ని పరామర్శించారు. దీని ద్వారా తెలంగాణ ప్రభుత్వం కౌలు రైతులను విస్మరించిందన్న అంశాన్ని రాహుల్ హైలైట్ చేయగలిగారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కౌలు రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటుందన్న సందేశాన్ని ప్రజల్లోకి పంపారు రాహుల్. మొత్తానికి రాహుల్ పర్యటనలతో తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త జోష్ వచ్చిందని.. ఇప్పటికే ఉన్న వేవ్‌కు రాహుల్ టూర్ మరింత ప్లస్ అవుతుందని అంటున్నారు విశ్లేషకులు.