Janwada Farm House: మళ్లీ తెరపైకి జన్వాడ ఫామ్‌హౌస్ పార్టీ కేసు
Janwada Farm House: జన్వాడ ఫామ్‌హౌస్ పార్టీ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో తాజాగా ఛార్జిషీట్ దాఖలైంది.
Janwada Farm House: మళ్లీ తెరపైకి జన్వాడ ఫామ్‌హౌస్ పార్టీ కేసు
Janwada Farm House: జన్వాడ ఫామ్‌హౌస్ పార్టీ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో తాజాగా ఛార్జిషీట్ దాఖలైంది. గతేడాది అక్టోబర్ 26న కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫామ్‌హౌజ్‌లో పార్టీ నిర్వహించారు. పార్టీకి అనుమతి లేకపోవడంతో పాటు అక్రమంగా మద్యం వినియోగించారని పోలీసులు రైడ్ చేశారు. ఆ పార్టీలో పాల్గొన్నవారికి అప్పట్లో డ్రగ్ పరీక్షలు నిర్వహించారు పోలీసులు. అందులో విజయ్ మద్దూరికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. దీంతో అతడిపై NDPS యాక్ట్ కింద నమోదు చేశారు మోకిల పోలీసులు. తాజాగా ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేశారు మోకిల పోలీసులు. ఈ కేసులో మొత్తం 35 మంది స్టేట్మెంట్లను పోలీసులు రికార్డ్ చేశారు.