Irani Chai: స్పెషల్ చాయ్.. యూత్‌కు క్రేజీ.. ఇరానీ చాయ్ టేస్టీ..

Irani Chai: హైదరాబాద్‌లో ఇరానీ చాయ్‌ ఫేమస్

Update: 2023-05-09 13:10 GMT

Irani Chai: స్పెషల్ చాయ్.. యూత్‌కు క్రేజీ.. ఇరానీ చాయ్ టేస్టీ..

Irani Chai: ఇరానీ చాయ్.. అంటే గుర్తొచ్చేది హైదరాబాద్ సిటీ... ఇక్కడ లభించే ఇరానీ చాయ్ వేరీ టేస్ట్ ఫుల్‌గా ఉంటుంది.. హైదరాబాదీ చాయ్‌కు ఉన్న క్రేజ్ ఇంతా అంతా కాదు. అందుకే ఈ చాయ్ చాలా ప్రసిద్ధి చెందింది. పొగలు కక్కే ఈ చాయ్ రుచిని ఆస్వాదిస్తూ... జనం ఎక్కువగా తాగుతుంటారు. మెదడులో చురుకుదనం, మనసుకు ఉత్సాహాన్ని పొందేందుకు చాలామందికి చాయ్‌ తాగడం అలవాటు. ఇప్పుడు మార్కెట్‌లో అనేక రకాల చాయ్‌లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఎన్నిరకాల చాయ్‌లు ఉన్నా.. ఇరానీ చాయ్‌దే స్పెషల్ టేస్ట్..

హైదరాబాదీ చాయ్ వేడి వేడిగా ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా సాసర్‌లో వంపుకొని, గాలితో పాటు సుర్రుమంటూ జుర్రుకోవాలి. తర్వాత ఉస్మానియా బిస్కెట్లను గరం గరం చాయ్‌లో ముంచుకుని తింటే ఉంటదీ.. వావ్... ఇరానీ టీ హైదరాబాదీ ప్రత్యేక దమ్ టీ... దీన్ని పాలు, టీ గాఢత తగ్గించి తయారు చేస్తారు. టీ తాగేటప్పుడు క్రీము ఆకృతిని ఇస్తుంది. ఈ చాయ్‌ని బిర్యానీ తిన్న తర్వాత గానీ.. బిస్కెట్లతో కలిపి తింటే ఆ మజాయే వేరు... మామూలు టీ కోసం పాలను ఓ పాత్రలో పోసి... స్టవ్‌పై పెట్టేసి తర్వాత చక్కెర, టీ పౌడర్ వేస్తారు. అది మరిగిన తర్వాత వడపోసుకుని తాగేస్తారు.

రానీ చాయ్ చేయాలంటే అంత సులువేం కాదు. దానికంటూ ఒక ప్రత్యేక పద్ధతి ఉంది. అలా చేస్తేనే ఆ చాయ్ అమృతంలా ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ ఇరానీ చాయ్ తయారు చేయడానికి టీ పౌడర్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. అన్ని రకాల టీ పౌడర్లతోనూ ఇరానీ చాయ్, హైదరాబాదీ చాయ్ తయారు చేయవచ్చు. కానీ హైదరాబాద్‌లో దొరికే ఇరానీ టీ లాంటి రుచి కావాలంటే మాత్రం హైదరాబాద్‌లో దొరికే టీ పౌడరే వాడాలి. అయితే ప్రస్తుతం వేసవికాలం... అయినా సరే టీ తాగడానికి వస్తున్నారని, బిజినెస్ బాగుందని చెబుతున్నారు.

చాలా రకాల చాయ్‌లు ఉన్నా... ఇరానీ చాయ్‌కి చాలా ప్రత్యేకత ఉందని, ఎంతో ఇష్టంతో తాగుతామని కస్టమర్స్ చెబుతున్నారు. ముంబై, బెంగళూరు, పూణే నగరాల్లోనూ ఈ చాయ్ ప్రసిద్ధి చెందింది. ఒక విధంగా చెప్పాలంటే, భారత్‌లోని అన్ని నగరాల్లోనూ ఈ ఇరానీ చాయ్ చాలా ప్రసిద్ధి.... సరదాగా ఫ్రెండ్స్‌తో కలిసి ఈ ఇరానీ టీ తాగుతూ ఎంజాయ్ చేస్తామని తెలిపారు చాయ్ ప్రేమికులు... మరి మనమూ... ఈ ఇరానీ చాయ్ తాగొద్దామా....???

Tags:    

Similar News