'లాలామూవ్' బుక్ చేయాలా.. లైఫ్ ఎంజాయ్ చేయాలా..
ఒకప్పటి కాలంలో ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే చాలు బస్ స్టాప్ లలోనో, రైల్వే స్టేషన్లలోనో గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉండేది.
ఒకప్పటి కాలంలో ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే చాలు బస్ స్టాప్ లలోనో, రైల్వే స్టేషన్లలోనో గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే దాదాపు ఒక రోజును కేటాయించే వారు. ఇక అర్జెంటుగా వెళ్లాల్సి ఉంటే ప్రయివేటు వాహనాలను అద్దెకు మాట్లాడితే వందలు, వేలల్లో వసూలు చేసేవారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి, టెక్నాలజీ పెరిగిపోయింది. ఇప్పుడు నగరంలోని ఏ మూల నుంచైనా కానీ కొన్ని యాప్‌లలో లాగిన్ అయి ఒక్క క్లిక్ ఇస్తే చాలు ప్రయాణించాల్సిన వాహనం మన ముందుకు వచ్చేస్తుంది. సరైన సమయంలో గమ్య స్థానానికి చేరుస్తుంది. అంతే కాదు ఎంత దూరానికి ఎంత చార్జీలు చెల్లించాలో అన్న విషయాలను కూడా ముందుగానే మనకు యాప్ ద్వారా తెలియజేస్తుంది. ఇలాంటి యాప్ లలో ముందంజలో ఉన్నవి ఓలా, ఉబర్‌లు ఉన్నాయి.
ఇక ప్రయాణికుల కోసం ఇన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ ఇంకో చిన్న ఇబ్బంది ఉంది. లాజిస్టిక్స్ రవాణా ఇబ్బందులు మాత్రం తీరలేదు. ఒక చోటి నుంచి మరో చోటికి సామాను తరలించాలన్నా, లేదా వేరే చోటు నుంచి వస్తువులను తీసుకురావాలన్నాకాస్త కష్టమే. దగ్గరలో ఉన్న అడ్డా దగ్గరకు వెళ్ళి వాహనదారులతో బేరాసారాలు ఆడాల్సిందే. వాహనదారులు ఎంత చార్జీలు చెప్పినా తప్పక ఇవ్వాల్సిందే. కానీ ఇప్పుడు దీనికి కూడా ఓ ప్రత్యామ్నాయం వచ్చేసింది. ప్రయాణికు లగ్గేజ్ ను గమ్యం చేర్చేందుకు 'లాలామూవ్' యాప్ ముందుకు వచ్చింది.
ఇప్పటివరకూ వాడుకలో ఉన్న ఉబర్, ఓలా యాప్ లు ఏ విధంగా పనిచేస్తాయో ఇప్పుడు ఈ'లాలామూవ్' యాప్ కూడా అదే విధంగా పనిచేస్తుంది. ఈ యాప్ ద్వారా లాజిస్టిక్స్ మోయడానికి కష్టంగా ఉండే వస్తువులను తరలించేందుకు ఉపయోగపడుతుంది. ఈ యాప్ ద్వారా సులభంగా వెహికల్‌ను ఎంపిక చేసుకోవచ్చు. యాప్ ద్వారా కూర్చున్న చోటునుంచే వెహికిల్‌ను బుక్ చేసుకోవచ్చు. మనం ఎంత సామాగ్రినైతే ఇతర ప్రాంతాలకు పంపించాలనకుంటామో ఆ సామాగ్రిని బట్టి వాహనాన్ని ఎంపిక చేసుకునే అవకాశం కూడా కల్పించింది. ఈ యాప్ ద్వారా అన్ని రకాల సేవలు అందుబాటులో వచ్చాయి. ఈ యాప్ ద్వారా తమకు కావలసిన వాహనాన్ని బుక్ చేసుకోగానే అచ్చం ఓలా, ఉబర్ యాప్ లో వచ్చినట్టుగానే డ్రైవర్ పేరుతో పాటు వాహన నెంబర్, గమ్యాన్ని చేర్చేందుకు అయ్యే చార్జీలను చూపిస్తుంది.
ఇక ఈ యాప్ ను ముందుగా హాంకాంగ్ దేశస్తులు ప్రారంభించారు. అక్కడ దీనికి మంచి క్రేజ్ ఉండడంతో ఇప్పుడు ఈ యాప్ ను భారతదేశం, చైనాతో పాటు మరో పది దేశాల్లో కూడా ప్రారంభించారు. ఆయా దేశాల్లో చూసుకుంటే ఈ యాప్ విజయవంతంగానే కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఇక ఊబర్, ఓలా యాప్‌లతో క్యాబ్ డ్రైవర్లకు ఏ విధంగా ఉపాధి దొరుకుతుందో, ఈ లాలామూవ్‌తో లాజిస్టిక్ వాహనదారులకు, డ్రైవర్లకు కూడా ఉపాధి అవకాశాలు మెండుగానే ఉంటాయి.
ఇక అడ్డాలపై వాహనాలను ఆపి గిరాకీ కోసం చూడవలసిన అవసరం వాహనదారులకు ఉండదు, ఇక డబ్బులిచ్చి వాహనాలను నిలుపుకునే అవసరం కస్టమర్లకు ఉండదు. ఓలా, ఉబర్ లలో లాగానే వాహనదారులు ఈ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంటుంది. బుకింగ్ పూర్తి చేసుకున్న వెంటనే యాప్ ద్వారా డబ్బులు నేరుగా డ్రైవర్ అకౌంట్‌లో జమవుతుంది. ఇక ఇంకెందుకు ఆలస్యం మీ వస్తువులను డ్యామేజీ లేకుండా గమ్యం స్థానాలకు చేర్చాలనుకుంటే వెంటనే లాలామూవ్ యాప్ ను బుక్ చేసుకోండి.