వాయు కాలుష్యంపై అవగాహన కల్పిస్తున్న తెలుగు ఎంపీ
దేశ రాజధాని ఢిల్లీలో నానాటికి తీవ్రమవుతున్న వాయు కాలుష్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణలోని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తానే స్వయంగా డిజైన్ చేసి తయారు చేసిన ఎలక్ట్రిక్ బైక్‌పై పార్లమెంట్‌కు వచ్చారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నానాటికి తీవ్రమవుతున్న వాయు కాలుష్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణలోని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తానే స్వయంగా డిజైన్ చేసి తయారు చేసిన ఎలక్ట్రిక్ బైక్‌పై పార్లమెంట్‌కు వచ్చారు.పర్యావరణహిత రవాణా వ్యవస్థల వినియోగమే కాలుష్య నివారణకు మార్గమని ఆయన అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వాడకంతో పర్యావరణానికి మేలు జరుగుతుందని వంశీకృష్ణ చెప్పారు.
వాహనాల వల్ల పెరుగుతున్న కార్బన్ ఉద్గారాలే ఢిల్లీలో వాయు కాలుష్యానికి ప్రధాన కారణమని పేర్కొన్న ఎంపీ వంశీకృష్ణ , ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ద్వారా ఇంధన వినియోగం తగ్గడంతో పాటు పర్యావరణానికి మేలు జరుగుతుందని వివరించారు. ప్రజాప్రతినిధులు ముందుండి మార్పుకు దారితీయాలని, ప్రజలంతా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు.
తానే తయారు చేసిన ఎలక్ట్రిక్ బైక్‌తో పార్లమెంట్‌కు రావడం ద్వారా స్వదేశీ సాంకేతికత, ఆవిష్కరణలు, యువత నైపుణ్యాలను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఎంపీ వంశీకృష్ణ చేసిన ఈ వినూత్న ప్రయత్నం రాజకీయ వర్గాలు, ప్రజల్లో విస్తృత చర్చకు దారితీస్తోంది.