TS Inter Exams 2024: తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
TS Inter Exams 2024: 1,521 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు.. పరీక్ష రాయనున్న 9,80,978 మంది విద్యార్థులు
TS Inter Exams 2024: తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
TS Inter Exams 2024: తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పరీక్షల కోసం మొత్తం 15 వందల 21 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి.. 9 లక్షల 80 వేల 978 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 9 నుంచి 12 వరకు పరీక్షలు జరగనున్నాయి.
ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు, ఫిబ్రవరి 29 నుంచి మార్చ్ 19 వరకు ఇంటర్ రెండవ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 4 లక్షల 78 వేల 718 మంది కాగా, సెకండ్ ఇయర్ విద్యార్థులు 5 లక్షల 2 వేల 260 మంది పరీక్షకు హాజరుకానున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించబోమని ఇప్పటికే ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.