అమెరికాలో కాల్పులు: హైదరాబాద్‌కు చెందిన రవితేజ మృతి

అమెరికాలో జరిగిన కాల్పుల్లో హైదరాబాద్ దిల్‌సుఖ్ నగర్ ఆర్‌కె పురానికి చెందిన రవితేజ మరణించారు

Update: 2025-01-20 05:43 GMT

అమెరికాలో కాల్పులు: హైదరాబాద్‌కు చెందిన రవితేజ మృతి

అమెరికాలో జరిగిన కాల్పుల్లో హైదరాబాద్ దిల్‌సుఖ్ నగర్ ఆర్‌కె పురానికి చెందిన రవితేజ మరణించారు. అమెరికాలో మాస్టర్స్ చేసేందుకు వెళ్లిన రవితేజ 2022లో వెళ్లారు. ఆయన మాస్టర్స్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు.రవితేజ కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఆర్ కే పురం గ్రీన హిల్స్ కాలనీ రోడ్డు నెంబర్ 2లో నివాసం ఉంటున్నారు.రవితేజ పేరేంట్స్ ది ఉమ్మడి నల్గొండ జిల్లా. 

రవితేజ ప్రస్తుతం అమెరికాలోని ఓ రెస్టారెంట్ లో పనిచేస్తున్నారు. ఈ రెస్టారెంట్ విదుల్లో భాగంగా ఆయన ఇవాళ ఉదయం పార్శిల్ డెలీవరీ చేసేందుకు వెళ్లిన సమయంలో కొందరు దుండగులు కాల్పులకు దిగారు. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. తన కొడుకును గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు దిగడంతో ఆయన చనిపోయారని సమాచారం అందిందన్నారు. తన కొడుకు మృతదేహాన్ని వెంటనే హైదరాబాద్‌కు వచ్చేలా చర్యలు తీసుకురావాలని రవితేజ తండ్రి ప్రభుత్వాన్ని కోరారు. 

అమెరికాలో కాల్పుల ఘటనలో భారత సంతతికి చెందిన పలువురు మరణించిన ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా నమోదౌతున్నాయి. ఇండియాలోని తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు ఎక్కువగా కాల్పుల ఘటనల్లో చనిపోతున్నారు. ఈ నెల 12న అమెరికా టెక్సాస్ నగరంలోని జరిగిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజిలికి చెందిన దాసరి శ్రీనివాసరావు , ధనలక్ష్మిల కొడుకు గోపీకృష్ణ మరణించారు. టెక్సాస్ లోని డాలస్ సూపర్ మార్కెట్ లో ఆయన పనిచేస్తున్నారు. గోపీకృష్ణ విధుల్లో ఉన్న సమయంలో దుండగుడు కాల్పులకు దిగారు. దీంతో ఆయన అక్కడకికక్కడే మరణించారు.


Tags:    

Similar News