Ikea India Stores Temporarily Closed in Hyderabad: కరోనా దెబ్బకు మూతపడ్డ ఐకియా..

Ikea India Stores temporarily closed in Hyderabad: ఇంటీరియర్ వస్తువులకు బ్రాండ్ అయిన ఐకియా నగరంలో కరోనా విజృంభిస్తున్న వేళ కీలక నిర్ణయం తీసుకుంది

Update: 2020-07-18 05:52 GMT
Ikea India Stores temporarily closed in Hyderabad

Ikea India temporarily closed outlet in Hyderabad: ఇంటీరియర్ వస్తువులకు బ్రాండ్ అయిన ఐకియా నగరంలో కరోనా విజృంభిస్తున్న వేళ కీలక నిర్ణయం తీసుకుంది. తమ వినియోగదారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకున్న స్వీడిష్ రిటైల్ సంస్థ ఐకియా నగరంలో ఉన్న తన స్టోర్ లను మళ్లీ కొన్ని రోజుల వరకు మూసివేయాలని నిర్ణయించింది. తమ వద్దకు వస్తున్న కస్టమర్లు, తమ వద్ద పని చేస్తున్న సిబ్బంది సేఫ్టీకి తాము అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే ఈ రోజు అంటే జులై 18 నుంచి తమ స్టోర్‌లను మూసివేస్తున్నామని ఐకియా ప్రకటించింది. ఈ విషయాన్ని తమ కస్టమర్లకు తెలియజేసేందుకుగాను ఐకియా ఇండియా సీఈవో అండ్ సీఎస్‌వో పీటర్ బెట్జెల్ పేరిట రాసిన లేఖను కంపెనీ వెబ్‌సైట్, సోషల్ మీడియా ద్వారా కస్టమర్లకు అందుబాటులో ఉంచారు. అంతే కాకుండా తమ వినియోగదారులకు మెయిల్స్ కూడా పంపించారని తెలిపారు.

2018 ఆగష్టు 9న హైదరాబాద్‌ నగరంలో రూ.700 కోట్ల వ్యయంతో 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐకియా స్టోర్‌ను ప్రారంభించారు. ఐకియా మొద్దమొదటి సారిగా మన దేశంలో ఈ స్టోర్ ద్వారా అడుగుపెట్టింది. అయితే ఈ ఏడాది ఒక్కసారిగా కరోనా వైరస్ వ్యాపించడంతో లాక్ డౌన్ లో భాగంగా కొన్ని రోజుల వరకు ఈ స్టోర్ ను మూసివేసారు. ఆ తరువాత ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులను ఇవ్వడంతో స్టోర్‌ను తిరిగి ప్రారంభించారు. మే నెలలో ఆన్‌లైన్ ద్వారా విక్రయాలు చేపట్టగా.. జూన్‌లో స్టోర్‌ను తిరిగి తెరిచారు. స్టోర్ ను ప్రారంభించిన తరువాత సిబ్బంధికి, వినియోగదారులకు కరోనా సోకకుండా అనేక జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. కానీ ప్రస్తుతం నగరంలో కేసుల సంఖ్య రెట్టింపవుతుండడంతో స్టోర్‌ను మూసివేయాలని నిర్ణయించారు. స్టోర్ మూసివేసినప్పటికీ ఆన్‌లైన్ స్టోర్, ఫ్రీ క్లిక్ అండ్ కలెక్ట్ సేవలు యథాతథంగా పని చేస్తాయని ఐకియా స్పష్టం చేసింది. మళ్లీ ఈ స్టోర్ ను త్వరలోనే తిరిగి తెరుస్తామనే ఆశాభావాన్ని ఐకియా సీఈవో వ్యక్తం చేశారు. 


Tags:    

Similar News