Vidyasagar Rao: హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అవుతుంది
Vidyasagar Rao: బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
Vidyasagar Rao: హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అవుతుంది
Vidyasagar Rao: బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశానికి హైదరాబాద్ రెండో రాజధాని అయ్యే అవకాశాలున్నాయన్నారు. హైదరాబాద్ రెండో రాజధాని అవుతుందనే నమ్మకం ఉందని.. రాజ్యాంగంలో కూడా ఈ అంశం ఉందని తెలిపారు. ఈ అంశంపై అన్ని పార్టీలు కలిసి వచ్చి చర్చ జరపాలని పిలుపునిచ్చారు విద్యాసాగర్ రావు. స్మాల్ స్టేట్స్ అనే పుస్తకంలో కూడా అంబేద్కర్ ఈ విషయాన్ని రాశారని తెలిపారు. బొల్లారం, సికింద్రాబాద్, హైదరాబాద్ లను కలిపి ఒక స్టేట్ గా చేసి, దాన్ని దేశ రెండో క్యాపిటల్ చేయాలని అంబేద్కర్ చెప్పారని అన్నారు. హైదరాబాద్ రెండో క్యాపిటల్ కావడం మన దేశ భద్రతకు మంచిదని పేర్కొన్నారని తెలిపారు.