హైదరాబాద్ మెట్రో రైల్‌ ప్రయాణికులకు శుభవార్త

Update: 2019-12-15 02:50 GMT

హైదరాబాద్ మెట్రో రైల్‌ ప్రయాణికులకు శుభవార్త వెలువడింది. రాబోతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇక నుంచి మెట్రో రైళ్లు రాత్రి 11 గంటల వరకు నడపనున్నారు. మెట్రో రైలు వేళల్లో మార్పులు చేసినట్లు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. రాత్రి ఆలస్యంగా ఇళ్లకు చేరుకునే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వారి అవసరాలకు అనుగుణంగా ఈ మార్పులు చేసినట్లు ఆయన వెల్లడించారు.

అన్ని టెర్మినళ్ల నుంచి రాత్రి 11 గంటలకు బయలుదేరి ఆఖరు స్టేషన్‌ కు 11.50 గంటలకు చేరుకుంటాయని అన్నారు. అయితే ఉదయం 6 గంటలకు కాకుండా 6.30 గంటలకు మెట్రో రైళ్లు ప్రారంభమవుతాయని షాక్ ఇచ్చారు. దీనివలన ఉదయం షిఫ్ట్ ఉద్యోగాలకు వెళ్లే వారు మరింత ఆలస్యంగా వెళ్లనున్నారు. త్వరలో సుమారు 1000 సిటీ బస్సులను ఆర్టీసీ రద్దు చేస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

Tags:    

Similar News