Fever Hospital DMO detained : బిల్లు విషయంలో ప్రశ్నించిన డీఎంవోను నిర్భంధించిన ప్రయివేటు ఆస్పత్రి యాజమాన్యం

Fever Hospital DMO detained: ప్రస్తుతం ఉన్న పరిస్థితులను హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రయివేటు ఆస్పత్రులు క్యాష్ చేసుకుంటున్నాయి.

Update: 2020-07-05 09:45 GMT

Fever Hospital DMO detained : ప్రస్తుతం ఉన్న పరిస్థితులను హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రయివేటు ఆస్పత్రులు క్యాష్ చేసుకుంటున్నాయి. కరోనా భయంతో వస్తున్న వారిని దొపిడి చేస్తున్నాయి. ఇప్పటివరకు ఇలాంటి విషయాలు అక్కడక్కడా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఇలాంటి సంఘటనే చాదర్‌ఘాట్‌లోని తుంబే ఆస్పత్రిలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఈ ఆస్పత్రిలో వైద్యం కోసం చేరిన సాధారణ ప్రజలతోపాటు కరోనా వారియర్స్‌కు కూడా అధిక బిల్లులు వేసి చుక్కలు చూపెడుతున్నారు. ఈ బిల్లులపై ఆ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్న ఫీవర్‌ ఆస్పత్రి డీఎంవో డాక్టర్‌ సుల్తానా ప్రశ్నించడంతో ఆమెను తుంబే ఆస్పత్రి సిబ్బంది నిర్బంధించారు. కరోనా లక్షణాలతో డీఎంవో వైద్యం కోసం తుంబే ఆస్పత్రిలో చేరగా తనకు 24 గంటల్లో లక్షా 15 వేల బిల్లు వేశారని, అధి ప్రశ్నించడంతో ఆమెను నిర్భిందించారని ఆమె సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో అందరికీ సేవలందించి ఫ్రంట్‌లైన్‌ వారియర్‌గా సేవలందించిన తన పట్ల తుంబే ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సుల్తానా ఆరోపించారు.

బిల్లులు అధికంగా వేస్తున్నారని ఆమె ప్రశ్నించడంతో సమయానికి సరైన వైద్య సేవలందించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా కరోనా మహమ్మారి బారినపడ్డారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. కాగా ఆమె కుటుంబసభ్యులు తుంబే ఆస్పత్రి యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క రోజుకే ఇంత బిల్లులు వేశారని విమర్శించారు. సుల్తానాను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఆమెకు మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, తుంబే ఆస్పత్రి గుర్తింపును రద్దు చేయాలని కోరారు.

Tags:    

Similar News