Shilpa Chowdary: శిల్పా చౌదరికి బెయిల్ నిరాకరణ
Shilpa Chowdary: కిట్టి పార్టీల పేరుతో అమాయకులను మోసం చేసి కోట్లు కొల్లగొట్టిన శిల్పా చౌదరి కస్టడీ, బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి.
Shilpa Chowdary: శిల్పా చౌదరికి బెయిల్ నిరాకరణ
Shilpa Chowdary: కిట్టి పార్టీల పేరుతో అమాయకులను మోసం చేసి కోట్లు కొల్లగొట్టిన శిల్పా చౌదరి కస్టడీ, బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. శిల్పా భర్త శ్రీనివాస్ ప్రసాద్‌కు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం శిల్పా బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. అలాగే, శిల్పా చౌదరిని ఐదు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. రేపటి నుంచి ఐదు రోజుల పాటు శిల్పా చౌదరి పోలీస్ కస్టడీలో ఉండనుంది. అధిక వడ్డీల పేరుతో మోసం చేసిన కేసులో శిల్పా చౌదరిని పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రూ.7కోట్లు తీసుకొని తిరిగి చెల్లించలేదంటూ శిల్పా చౌదరిపై పలువురు ఫిర్యాదు చేశారు.