Chevella Road Accident: మీర్జాగూడ బస్సు ప్రమాదంలో తల్లి, రెండు నెలల చిన్నారి మృతి
Chevella Road Accident: వికారాబాద్ జిల్లా తాండూరు ఇంద్ర నగర్‌లో విషాదం చోటు చేసుకుంది.
Chevella Road Accident: వికారాబాద్ జిల్లా తాండూరు ఇంద్ర నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఇంద్రనగర్ చెందిన ఖలీల్ భార్య సాలేహాతో పాటు, రెండు నెలల కూతురు.. మీర్జాగూడ ప్రమాదంలో మృతి చెందారు. ఖలీల్ వెల్డింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే హైదరాబాద్ సాయి నగర్‌కు చెందిన సాలేహాతో ఖలీల్‌కు సంవత్సరం క్రితం పెళ్లి అయ్యింది. హైదరబాద్‌లో ఉన్న తల్లి వద్దకు వెళ్లుతున్న సాలేహా.. మీర్జాగూడ బస్సు ప్రమాదంలో కూతురు పాటు ప్రమాదంలో మృతి చెందింది. భార్య, కూతురు మృతి చెందడంతో ఖలీల్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు.