అనాథల ఆకలికేకలు.. దాతల కోసం ఎదురుచూపులు

Update: 2020-06-29 09:12 GMT

అది అనాథల పుణ్యక్షేత్రం వందలాది మంది అభాగ్యుల కడుపు నింపే దేవాలయం. ఏ దిక్కు లేని వాళ్లకు పెద్ద దిక్కుగా ఉన్న నిలయం. ఇన్నాళ్లు మూడుపూటల భోజనం సేవించిన అనాథలకు ఇప్పుడు రెండు పూటల భోజనం దొరకడమే గగనమైంది. అర్థకలితో రోజులు గడుపుతున్నారు. కరోనా రక్కసి కారణంగా ఆదరించే దాతలు తగ్గుముఖం పట్టారు. కానీ ఆశ్రమ నిర్వాహకుడు వారందరికీ పట్టెడన్నం పెట్టేందుకు నిర్విరామ కృషి చేస్తున్నారు.

ఇక్కడ కనిపిస్తున్న వీరంతా ఏదో దేవాలయానికి వచ్చిన భక్తులు కాదు. ఓ అశ్రమంలో సేదతీరుతున్న అనాథలు, మానసిక వికలాంగులు ఇన్నాళ్లు హాయిగా గడిచిన రోజులు ఇప్పుడు అర్థాకలితో గడుస్తున్నవి. తమకు ఆకలి అని చెప్పే స్థితిలో కూడా లేరు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ లో గట్టు శంకర్ అనే వ్యక్తి అమ్మనాన్నపేరుతో ఓ అనాథ అశ్రమాన్ని ప్రారంభించాడు. ఒకరితో మొదలైన ఆశ్రమం ఇప్పుడు 400వందల మందికి ఆసరాగా నిలుస్తోంది. ఏ దిక్కులేని వారందరికీ పెద్ద దిక్కు అయ్యాడు శంకర్. అసలు పేరు కూడా తెలియని వాళ్లను శంకర్ కంటికి రెప్పాలా కాపుడుతున్నాడు.

తన అన్నకు వచ్చిన కష్టాన్ని కల్లారా చూసిన గట్టు శంకర్ రోడ్డుపై ఉన్న అభాగ్యులకు అసరా ఉండాలని సంకల్పించారు. పదేళ్ల క్రితం అమ్మనాన్న అనాథ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు శంకర్. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అనాథ మానసిక‌ వికలాంగులను చేరదీసి మళ్లీ పునర్జన్మను ఇచ్చారు. ఈయన చేస్తున్న కృషిని గమనించిన ప్రభుత్వం ఆశ్రమ నిర్వాహణకు స్థలం కేటాయించింది. దాతల సాయంతో షెడ్డులను ఏర్పరిచారు. ఇక ఎక్కడ మానసిక వికలాంగులు, వృద్ధులు అనాథగా కనిపించినా అక్కున చేర్చుకుంటున్నారు. అయితే ఇన్నాళ్లు వీళ్లకు మూడు పూటల భోజనం పెట్టిన శంకర్. కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులతో కేవలం రెండు పూటల భోజనం అందిస్తున్నాడు. వాళ్లను ఒక్కపూట పస్తులు ఉంచుతుండడంతో ప్రతినిత్యం మదనపడుతున్నారు. పైగా వారి అవసరాలు, వైద్యఖర్చులకు దాతలు ముందుకు రావాలని వేడుకుంటున్నారు శంకర్.  


Full View


Tags:    

Similar News