Heat Waves: మండుతున్న ఎండలు...45డిగ్రీలు ఉగ్రరూపం చూపుతున్న భానుడు
Heat Waves: మరో నాలుగు రోజులు ఇదే తరహా వాతావరణం
Heat Waves: మండుతున్న ఎండలు...45డిగ్రీలు ఉగ్రరూపం చూపుతున్న భానుడు
Heat Waves: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల 45 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడి ఉగ్రరూపం దాల్చుతున్నాడు. నిన్న అత్యధికంగా కొత్తగూడెంలో 47 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఏపీలో 9 జిల్లాల్లో 46 డిగ్రీల కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో 10 జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మరో నాలుగు రోజులు ఇదే తరహా క్లైమెట్ కొనసాగనుందని వాతావరణశాఖ సూచించింది. వడదెబ్బకు తెలంగాణ, ఏపీలో ఐదుగురు మృతి చెందగా.. ఎండల నుంచి జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.