Konda Surekha: మంత్రి కొండా సురేఖ ఇంట్లో హైడ్రామా.. ఓఎస్డీ సుమంత్ కోసం పోలీసుల గాలింపు

Konda Surekha: జూబ్లీహిల్స్‌లోని మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద హైడ్రామా చోటుచేసుకుంది.

Update: 2025-10-16 07:08 GMT

Konda Surekha: మంత్రి కొండా సురేఖ ఇంట్లో హైడ్రామా.. ఓఎస్డీ సుమంత్ కోసం పోలీసుల గాలింపు

Konda Surekha: జూబ్లీహిల్స్‌లోని మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖ ఓఎస్డీగా ఉన్న సుమంత్‌పై పలు అవినీతి ఆరోపణలు ఉండటంతో.. రాష్ట్ర ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. సుమంత్‌ కొండా సురేఖ ఇంట్లో తలదాచుకున్నట్టు సమాచారం ఉండటంతో పోలీసులు అతడిని గాలిస్తున్నారు.

దీంతో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ విషయంపై మంత్రులు కొండా సురేఖతో మంత్రులు చర్చిస్తున్నారు. మరికొద్ది సేపట్లో మంత్రి మీడియాతో మాట్లాడనున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్లో ఇంచార్జి మీనాక్షి నటరాజన్ను కలవనున్నారు. ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో పాల్గొననున్నారు మంత్రి కొండా సురేఖ.

Similar News