హైదరాబాద్‌లో భారీ వర్షం..మరో రెండు రోజులు‎ కురిసే అవకాశం

కొత్త సంవత్సరం వేళ భాగ్యనగరంలో వర్షం పడింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సాయంత్రం భారీ వర్షం కురిసింది.

Update: 2020-01-01 14:29 GMT
Hyderabad Rain

కొత్త సంవత్సరం వేళ భాగ్యనగరంలో వర్షం పడింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సాయంత్రం నాలుగ్నర గంటల ప్రాంతలో భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో చిరుజల్లులు పడగా, పంజాగుట్ట, లక్డీకాఫూల్‌, నాంపల్లి, ప్రాంతాల్లో భారీ వర్షం కురింసింది. మాసబ్ ట్యాంక్, మెహదీపట్నంలో ఓ మెస్తారు వర్షం కురిసింది. నాంపల్లిలో భారీ వర్షం కురవడంలో నుమాయిష్ ఎగ్జిబిష్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. నుమాయిష్ ప్రాంతంలో భారీగా వరదనీరు చేరింది. దీంతో అక్కడ దుకాణదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొ్న్నారు. డిసెంబర్ 31న ఉదయం కూడా భారీ వర్షం కురిసింది.

వర్షం కారణంగా ఆశోక్ నగర్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న బుక్ ఫెయిర్‌కు వెళ్లిన వారు ఇబ్బంది పడ్డారు. షేక్ పేటలో 3 మి.మీ, కుత్బుల్లాపూర్‌లో 2.8 మి.మీ. వర్షం కురిసింది. ఆంధప్రదేశ్, తెలంగాణల్లో మరో రెండు మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తెలంగాణపై ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో వానలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర ఒడిశా ఈశాన్యం నుంచి వీచే చలి గాలులు ఆలస్యంగా రావడంతో.. చాలా రోజులపాటు చలి తక్కువగా నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో ఆగ్నేయ నుంచి గాలులు వీస్తున్నాయ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు.

జనవరి మూడు వరకు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రముఖ సంస్థ వెల్లడించింది. గరిష్ట ఉష్ణో గ్రతలు తగ్గుతాయని పేర్కొంది. జనవరి 4 నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వెల్లడించింది. కాగా. ఇప్పటికే కురిసిన వర్షంతో హైదరాబాద్ రోడ్లపై మురికి నీరు ప్రవహిస్తుంది. ఒకవైపు చలి మరో వైపు వర్షాలతో నగర వాసుల బెంబేలెత్తిపోతున్నారు.


 


Tags:    

Similar News