బంగా‌ళా‌ఖా‌తంలో తీవ్ర అల్ప‌పీ‌డనం.. 16 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Heavy Rains : గత కొన్నిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఏపీ తెలంగాణ రాష్ట్రాలు తడిసి ముద్దయ్యాయి.

Update: 2020-08-20 08:22 GMT
ప్రతీకాత్మక చిత్రం

Heavy Rains : గత కొన్నిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు తడిసి ముద్దయ్యాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోనూ వాగులు, వంకలు, నదులు, చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఇప్పటికే వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు ప్రజల జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయింది. అయితే మరికొన్ని రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు పడతాయని వాతావరణశాఖ అధికారులు ప్రజలకు మరో షాక్ ఇచ్చారు.

బుధ‌వారం ఉదయం 5.30 గంటలకు ఈశాన్య బంగా‌ళా‌ఖాతం, దాని పరి‌స‌ర‌ప్రాం‌తాల్లో ఉప‌రి‌తల ఆవ‌ర్తన ప్రభా‌వంతో ఉత్తర బంగా‌ళా‌ఖాతం, పరి‌సర ప్రాంతా ల్లో అల్ప‌పీ‌డనం ఏర్ప‌డిందని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం తెలిపింది. ఉదయం 8.30 గంట‌లకు తీవ్ర అల్ప‌పీ‌డ‌నంగామారి వాయవ్య బంగా‌ళా‌ఖా‌తంలో కేంద్రీ‌కృ‌త‌మై‌నట్టు తెలిపింది. కాగా దానికి అనుబంధంగా 7.6 కిలోమీటర్‌ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, ఇది పశ్చిమ దిశగా ప్రయాణించి రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభా‌వంతో గురు, శుక్ర‌వా‌రాల్లో రాష్ట్ర‌వ్యా‌ప్తంగా పలు‌చోట్ల తేలి‌క‌పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురు‌స్తా‌యని తెలిపింది.

ముఖ్యంగా తెలంగాణలోని 16 జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా పడనుందని తెలిపింది. ఇదే క్రమంలో వాయవ్య బంగా‌ళా‌ఖా‌తంలో ఈ నెల 23న మరో అల్ప‌పీ‌డనం ఏర్పడే అవ‌కాశం ఉన్నట్టు పేర్కొన్న‌ది. ఇప్పటికే భారీ వర్షాలతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. కరీంనగర్‌, పెద్దపల్లి, ములుగు, వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, మహబూబాబాద్‌, భద్రాది కొత్తగూడెం, ఆదిలాబాద్‌, నిర్మల్‌, కోమురంభీం ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, భూపాలపల్లి, ఖమ్మం జిల్లాలో ఈ రోజు ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.



Tags:    

Similar News