Heavy Rain: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో భారీగా వర్షం

Heavy Rain: చెరువుల్లా మారిపోయిన పంట పొలాలు * వరద ఉధృతికి కొట్టుకపోయిన పంటలు

Update: 2021-07-25 06:58 GMT

నిజామాబాద్ లో భారీ వర్షాలు (ఫోటో ది హన్స్ ఇండియా)

Heavy Rain: తొలకరి చినుకులు రాగానే రైతులు మురిసిపోయారు. సాగునీటికి డోకా లేదని సంబురపడ్డారు. కానీ ఆ సంబురం ఎంతోకాలం నిల్వలేదు. గ్యాప్‌లేకుండా కురుస్తున్న వర్షాలు కొన్ని ప్రాంతాల్లో రైతులకు కన్నీళ్లను మిగిల్చాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 22 మండలాల్లో పంట పొలాలు చెరువుల్లా మరాయి. వరద తాకిడికి పంటలు కొట్టుకుపోయాయి. కొన్ని చోట్ల ఇసుక మేటలు వెలిశాయి. వందల ఎకరాల్లో పంట వర్షార్పణమయ్యింది.

కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల పరిధిలో వేలాది ఎకరాల్లో పంట నీటమునిగింది. సోయా, వరి, మొక్కజొన్న పంటలకు అధిక నష్టం వాటిల్లింది. కామారెడ్డి జిల్లాలో 8 మండలాల పరిధిలోని పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ అధికారులు ప్రాథమిక నివేదిక సర్కారుకు నివేదించారు. వివిధ రకాల పంటలు 18, 500 ఎకరాల్లో నష్టం జరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు.

నిజామాబాద్ జిల్లాలోని 14 మండలాల పరిధిలో 5వేల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. ఆర్మూర్, నందిపేట, బాల్కొండ, బోధన్, నిజామాబాద్ రూరల్ ప్రాంతాల్లో భారీగా పంట వాటిల్లింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత రైతులు కోరుకుంటున్నారు. 

Tags:    

Similar News