Heavy Rains: తెలంగాణకు భారీ వర్ష సూచన.. రానున్న రెండు రోజుల పాటు..

Heavy Rains: దక్షిణ ఒడిశా - ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ తీరాలకు ఆనుకుని ఉన్న వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరంలో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.

Update: 2022-07-08 12:15 GMT

Heavy Rains: తెలంగాణకు భారీ వర్ష సూచన.. రానున్న రెండు రోజుల పాటు..

Heavy Rains: దక్షిణ ఒడిశా - ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ తీరాలకు ఆనుకుని ఉన్న వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరంలో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఇటు రుతుపవన ద్రోణి.. జైసాల్మర్, కోట, జబల్‌పూర్, పెండ్రా రోడ్, కళింగపట్నం మీదుగా నైరుతి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఆవర్తనం మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది ఉంది. వీటి ప్రభావంతో రాగల రెండు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని వెల్లడించింది. ‎

Tags:    

Similar News