Telangana: మరో నాలుగైదు గంటలు కుండపోత వర్షం.. 13 జిల్లాలకు రెడ్ అలెర్ట్

Telangana: బంగాళాఖాతంలో ఏర్పాడిన గులాబ్‌ తుఫాన్ తెలంగాణలో బీభత్సం సృష్టిస్తోంది.

Update: 2021-09-27 12:49 GMT

Telangana: మరో నాలుగైదు గంటలు కుండపోత వర్షం.. 13 జిల్లాలకు రెడ్ అలెర్ట్

Telangana: బంగాళాఖాతంలో ఏర్పాడిన గులాబ్‌ తుఫాన్ తెలంగాణలో బీభత్సం సృష్టిస్తోంది. తుఫాన్ తీవ్ర వాయుగుండంగా మారడంతో.. వర్షం బీభత్సం సృష్టిస్తోంది. తుఫాన్ ఎఫెక్ట్‌ మరో ఆరు గంటల పాటు ఉండడంతో హైదరాబాద్‌తో సహా 13 జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది వాతావరణశాఖ. వరంగల్ అర్బన్, రూరల్, సిద్ధిపేట, సంగారెడ్డి, జనగామ, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ వార్నింగ్ జారీ చేసింది. ఈ జిల్లాలకు తీవ్ర భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి తీవ్ర, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్‌ వార్నింగ్ కొనసాగుతుందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

తెలంగాణ వ్యాప్తంగా మరో ఆరు గంటల పాటు భీభత్సం సృష్టించే అవకాశం ఉందని హైదారాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఆరు గంటల తర్వాత క్రమంగా వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. భారీ వర్షాల కారణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అత్యవసరం అయితే తప్ప.. ఎవరూ బయటకు రావొద్దని సూచించింది.

మరోవైపు.. హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మబ్బులు దట్టంగా అలుముకున్నాయి. దాంతో సాయంత్రం నాలుగు గంటలకే నగరం చీకటిని అలుముకుంది. దాంతో దాదాపు మూడు గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతూనే ఉంది.. నగరం నలుమూలల వర్షం బీభత్సం సృష్టిస్తోంది. మరోవైపు.. హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ హై అలర్ట్ ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారీ వర్షానికి వరద నీరు రోడ్లపైకి వచ్చి చేరింది. ఎక్కడ ఏ మ్యాన్‌హోల్ ఉందోనని ప్రజలు భయపడుతున్నారు. వాన పడుతున్న సమయంలో వాహనదారులు వాహనాలను జాగ్రత్తగా నడపాలని సూచించింది. ఇప్పటికే జీహెచ్ఎంసీ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. ఉరుములు, మెరుపులు రావడంతో పలు ప్రాంతంలో విద్యుత్‌కు అంతరాయం ఏర్పాడింది.. రెస్క్యూ టీంను అప్రమత్తం చేసింది జీహెచ్ఎంసీ.

గులాబ్ తుఫాన్ పై తెలుగు సీఎంలు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఢిల్లీ నుంచి భారీ వర్షాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గులాబ్ ఎఫెక్ట్‌తో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా జాగ్రత్త పడాలన్నారు. పోలీస్, రెవెన్యూ తదితర శాఖలు సమన్వయంతో కృషి చేయాలన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. సీఎం ఆదేశాలతో సీఎస్ సోమేశ్ కుమార్ మరోసారి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనూ ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సచివాలయానికి అందివ్వాలని ఆదేశించారు.

Tags:    

Similar News