డబ్బులు లేక అమ్మను ఆస్పత్రికి మోసుకెళ్లిన కుమారుడు.. మానవత్వం చాటుకున్న జగిత్యాల ఎమ్మెల్యే..
జగిత్యాల జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. చేతిలో డబ్బులు లేక కన్నతల్లిని బుజానవేసుకుని రోడ్డుపై ఆస్పత్రికి మోసుకెళ్లాడు ఓ కొడుకు.
జగిత్యాల జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. చేతిలో డబ్బులు లేక కన్నతల్లిని బుజానవేసుకుని రోడ్డుపై ఆస్పత్రికి మోసుకెళ్లాడు ఓ కొడుకు. నిజామాబాద్‌లో కూలీగా పని చేస్తూ తల్లిని పోషిస్తున్న దీపక్ అనే యువకుడు. తల్లి బాలమ్మ ఆరోగ్యం క్షీణించడంతో తన తల్లిని చికిత్స కోసం జగిత్యాల ఆస్పత్రికి తీసుకొచ్చాడు.
డబ్బులు లేకపోవడంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉండటంతో.. జగిత్యాల వరకు బస్సులోనే తీసుకొచ్చి, బస్టాండ్ నుంచి తల్లిని బుజాన మోసుకుంటూ ఆస్పత్రికి బయలుదేరాడు. అటుగావెళ్తున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వారిని గమనించి తనకారులో ఆస్పత్రికి తరలించాడు.