Harish Rao: దేశ ప్రజల ఆహార కొరత తీర్చిన మహానుభావుడు స్వామినాథన్
Harish Rao: దేశం స్వయం సమృద్ధి సాధించేందుకు స్వామినాథన్ ఎంతో కృషి చేశారు
Harish Rao: దేశ ప్రజల ఆహార కొరత తీర్చిన మహానుభావుడు స్వామినాథన్
Harish Rao: భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ మృతి బాధాకరమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తగా అధిక దిగుబడినిచ్చే వరి, గోధుమ వంగడాలను సృష్టించి, ఆహార రంగంలో మన దేశం స్వయం సమృద్ధి సాధించేందుకు స్వామినాథన్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. తన పరిశోధనలు, సిఫారసుల ద్వారా అటు రైతులకు ఆదాయం పెంచడంతో పాటు, ఇటు దేశ ప్రజల ఆహార కొరతను తీర్చిన మహానుభావుడు స్వామినాథన్ అని పేర్కొన్నారు.
దేశ రైతాంగం ప్రపంచ ప్రజల ఆకలిని తీర్చే స్థాయికి ఎదగడానికి కారణం స్వామినాథన్ సృష్టించిన హరిత విప్లవమేనని తెలిపారు. ఆయన మరణం పరిశోధన రంగంతో పాటు యావత్ దేశ వ్యవసాయ రంగానికి తీరని లోటన్నారు. స్వామినాథన్ ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.