Harish Rao: ట్విట్టర్ లో కాంగ్రెస్ సర్కార్‌పై హరీష్‌రావు విమర్శలు
Harish Rao: గత కాంగ్రెస్ పాలనలోని నీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయి
Harish Rao: ట్విట్టర్ లో కాంగ్రెస్ సర్కార్‌పై హరీష్‌రావు విమర్శలు
Harish Rao: గత కాంగ్రెస్ పాలనలోని నీటి కష్టాలు రాష్ట్రంలో మళ్లీ మొదలయ్యాయని ట్విట్టర్‌లో విమర్శించారు మాజీ మంత్రి హరీష్‌రావు. తాగునీటి కోసం తెలంగాణ గొంతెండిపోతుందని ట్వీట్ చేసిన ఆయన, గుక్కెడు మంచి నీళ్ల కోసం ప్రజలు రోడ్లెక్కుతున్నారని తెలిపారు. ఖాళీ బిందెలతో ధర్నాలు, ట్యాంకర్ల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో ఇలాంటి దుస్థితి, దృశ్యాలు ఎప్పుడూ కనిపించలేదన్నారు. మారుమూల తండాల్లోనూ మిషన్ భగీరథ జలధార సమృద్ధిగా వచ్చేదని ట్వీట్ చేశారు. పంటలకు సాగునీళ్లు ఎలాగూ ఇవ్వని కాంగ్రెస్ సర్కార్.. కనీసం గొంతు తడుపుకోవడానికైనా ప్రజలకు మంచినీళ్లివ్వాలని కోరుతున్నట్లు ట్వీట్ చేశారు.