Harish Rao: కర్ణాటకలో జేడీఎస్ ప్రభుత్వం రావాలని.. సీఎం కేసీఆర్‌ ఆకాంక్షిస్తున్నారు

Harish Rao: దేశవ్యాప్తంగా బీఆర్‌ఎస్ పని చేస్తుంది

Update: 2023-04-17 02:40 GMT

Harish Rao: కర్ణాటకలో జేడీఎస్ ప్రభుత్వం రావాలని.. సీఎం కేసీఆర్‌ ఆకాంక్షిస్తున్నారు

Harish Rao: కర్ణాటకలో జేడీఎస్ ప్రభుత్వం రావాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు మంత్రి హరీశ్ రావు. అందుకోసం బీఆర్ఎస్‌ కృషి చేస్తుందన్నారు. సిద్ధిపేటలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారాయన. తెలంగాణలో బీఆర్‌ఎస్ అమలు చేస్తున్న పథకాలు దేశానికే మోడల్‌గా నిలుస్తున్నాయన్నారు హరీశ్ రావు. గంగ జామున తెహజీబ్ సర్కార్ కర్ణాటకలో రావాలన్నదే తమ అభిమతమని మంత్రి హరీశ్ రావు అన్నారు. దేశవ్యాప్తంగా బీఆర్ ఎస్ పని చేస్తున్నదని.. కర్ణాటకలో జేడీఎస్ తో కలిసి పని చేస్తామన్నారు.

కర్ణాటకలో జే.డి.ఎస్ ప్రభుత్వం వస్తుందని, తాము కూడా సీఎం కెసిఆర్ లాగా కర్ణాటకలో తెలంగాణ రాష్ట్ర పథకాలను అమలు చేస్తామని ఆ రాష్ట్ర మాజీ మంత్రి, జేడీఎస్ నేత ఇబ్రాహీం అన్నారు. తెలంగాణలో మాదిరి హిందూ ముస్లింలు ఒక్క తల్లి పిల్లలాగా ఉండాలి అని కోరుకుంటున్నామన్నారు. కర్ణాటక లో బిజెపి నాయకులు తమ పార్టీ లో చేరుతున్నారని, కర్ణాటకలో తాము 2009 లో రిజర్వేషన్ ఇస్తే, బిజెపి ప్రభుత్వం తేసివేసిందన్నారు. యువకులు ఓట్లు వెయ్యడం లేదని, ఓట్లు వెయ్యడం ఎలా అనేది కేరళ ప్రజల నుండి నేర్చుకోవాలన్నారు. వాళ్ళు 1200 నౌకరి చేసినా, 500 రూపాయలు రవాణా ఖర్చు చేసి ఓటు వెయ్యడానికి వెళ్తారని చెప్పారు. మన యువకులు ఓట్లు వెయ్యనంతవరకు రోజుకో మోడీ పుట్టుకువస్తారన్నారు. రంజాన్ సందర్భంగా సిద్దిపేట కొండా భూదేవి గార్డెన్ లో ముస్లిం మైనార్టీలకు రంజాన్ తోఫాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పని చేస్తాడని, అన్ని మతాల పేద ప్రజల పరువు కోసం ఆలోచిస్తాడన్నారు మంత్రి హరీశ్ రావు. ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో మరెక్కడా లేరన్నారు. ముస్లిం మైనారిటీలు తమ బిడ్డల చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు.

ప్రభుత్వం మైనార్టీల కోసం ప్రత్యేకంగా రేసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించిందన్నారు. సదుపాయాలు కల్పించడం మా వంతు.. పిల్లలను చదివించడం మీ వంతన్నారు. స్వచ్ఛ సిద్దిపేటకు అందరూ సహకరించాలని, మీ ఇల్లు ఒక్కటే శుభ్రంగా ఉంటే చాలదు.. మీ గల్లీ, ఊరు స్వచ్చంగా ఉండాలన్నారు. పేదలకు కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ వంటి పథకాల ద్వారా లక్ష రూపాయల సాయం అందిస్తున్నదన్నారు. మహిళలకు మంచి నీళ్ల కష్టాలు తీర్చామని, టీడీపీ, కాంగ్రెస్ హయాంలో ఎవరైనా పేదలకు ఇలా ఇచ్చారా ? అని ప్రశ్నించారు. సిద్దిపేటలో అన్ని సదుపాయాలతో ప్రభుత్వ అసుపత్రి నిర్మించామని.. అన్ని సుపాయలు కల్పించామని చెప్పారు. పేదలు అనవసరంగా ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లి మీ పైసలు వృధా చెలుకోవద్దన్నారు.

సిద్దిపేట విపంచి కళానిలయంలో హైదరాబాద్ ఇఫ్లు (ఓయూ) ద్వారా ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల విద్యారులకు ఆంగ్ల భాష పై శిక్షణ తరగతులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికేట్ లు అందజేశారు మంత్రి హరీశ్ రావు. దేశంలోనే ఒక ఫారిన్ లాంగ్యువెజ్ యూనివర్సిటీ ఒక పాఠశాలను దత్తత తీసుకోవడం మొట్టమొదటి సారి అని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అబ్దుతమైన పేరు తెచ్చుకున్న పాఠశాల ఇందిరానగర్ జడ్పిహెచ్ఎస్ అని, వెయ్యి మంది విద్యార్థులతో, ఉత్తమ ర్యాంకుల్తో ఆదర్శంగా నిలిచిందన్నారు. పాఠశాల కు అన్ని సదుపాయాలు కల్పించామని, పిల్లలు ఆ సదుపాయాలు అందిపుచ్చుకున్న తీరు అద్భుతంగా మంత్రి పేర్కొన్నారు. భాష పై ఎంత పట్టు ఉంటే అంతా ఎఫెక్టీవ్ గా మాట్లాడగలుగుతారని చెప్పారు. ఫ్రెంచ్, స్పానిష్ భాషల్లో విద్యార్థులు చాలా చక్కగా మాట్లాడుతున్నారన్నారు. విదేశీ భాషలు నేర్చుకుంటే విశ్వ పౌరులుగా మారుతారని, జిల్లా పరిషత్ ఇందిరానగర్ స్కూల్, ఇఫ్లు రిలేషన్ కంటిన్యూ అవుతుందని మంత్రి చెప్పారు.

Tags:    

Similar News