Governor Tamilisai: అలా నలుగురు చనిపోవడం మామూలు విషయం కాదు..
Governor Tamilisai: హైదరాబాద్ నిమ్స్ లో చికిత్సపొందుతున్న కుటుంబ నియంత్రణ ఆపరేషన్ బాధితులను గవర్నర్ తమిళి సై పరామర్శించారు.
Governor Tamilisai: అలా నలుగురు చనిపోవడం మామూలు విషయం కాదు..
Governor Tamilisai: హైదరాబాద్ నిమ్స్ లో చికిత్సపొందుతున్న కుటుంబ నియంత్రణ ఆపరేషన్ బాధితులను గవర్నర్ తమిళి సై పరామర్శించారు. ఇబ్రహింపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ తర్వాత అస్వస్థతకు గురైన మహిళలు నిమ్స్ లో చికిత్సపొందుతున్నారు. వీరిని గవర్నర్ తమిళి సై పరామర్శించారు. మహిళల ఆరోగ్య పరిస్థితిని ఆమె అడిగి తెలుసుకుంటున్నారు.
ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రిలో కుటుంబనియంత్రణ ఆపరేషన్లు వికటించడంతో ఇన్ఫెక్షన్ తో ఇబ్బందిపడుతున్న బాధితులు నిమ్స్ లో చికిత్సపొందుతున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని గవర్నర్, వైద్యులకు సూచించారు. ప్రస్తుతం నిమ్స్ లో 11 మంది మహిళలు చికిత్సపొందుతున్నారు. ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ (కు.ని.) చికిత్సలు వికటించి నలుగురు చనిపోవడమనేది మామూలు విషయం కాదని.. ఆమోదయోగ్యం కూడా కాదని గవర్నర్ తమిళిసై అన్నారు. దీనిపై విచారణ జరుగుతోందని.. నివేదిక వచ్చాక పూర్తి కారణాలు తెలుస్తాయని చెప్పారు.