Governor Tamilisai: ప్రజాసంక్షేమం కోసమే ఆరు గ్యారంటీలు
Governor Tamilisai: తెలంగాణ దేశానికే ఆదర్శం కాబోతుంది
Governor Tamilisai: ప్రజాసంక్షేమం కోసమే ఆరు గ్యారంటీలు
Governor Tamilisai: ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కృషి చేస్తామని తెలిపారు గవర్నర్ తమిళిసై. 4 కోట్ల ప్రజల ఆకాంక్షలతో ఏర్పడిన రాష్ట్రం.. దేశానికే ఆదర్శం కాబోతుందని అన్నారు. ప్రజాసంక్షేమం కోసమే ఆరు గ్యారంటీలను ప్రకటించినట్లు తెలిపారు. హామీలకు చట్టబద్ధత కల్పించే దస్త్రంపై సీఎం తొలి సంతకం చేశారన్నారు. తొలి అడుగులోనే సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికిందన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు గవర్నర్.