హైదరబాద్‌లో రోప్‌వేకు సర్కార్ ప్రణాళికలు

Update: 2021-02-03 07:05 GMT

Representational Image

తెలంగాణలో పర్యాటక రంగాన్ని మరింత ఆకర్షణీయంగా తయారు చేయడానికి ప్రభుత్వం భారీ ప్రణాళికలతో ముందుకు వెళ్తుంది.. అందుకోసం గ్రేటర్‌‌లో రోప్‌ వే ప్రయాణాలపై సర్కారు కసరత్తు చేస్తోంది. దీంతో పాటు అటు టూరిజం అభివృద్ధి తో పాటు, ఇటు ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి రోప్‌వేను హైదరాబాద్ లో 3 కారిడార్ లలో ఏర్పాటును పరిశీలిస్తున్నారు.

హైదరాబాద్‌లో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందడంతో పాటు ప్రస్తుతం నగరంలో టూరిజం స్పాట్లను నగర అందాలను ఆకాశంలో నుండి క్షణాల్లో చూడడానికి రోప్ వే ను ఏర్పాటు చేయాలనీ భావిస్తుంది మొత్తం 3 కారిడార్‌లలో 17 కి.మీ మేర ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించారు.

ఇందుకోసం యూనిఫైడ్‌ మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ డీపీఆర్‌లు సిద్ధం చేస్తుంది. ఇప్పటికే సింగపూర్‌ రోప్‌ వే మార్గంపై అధ్యయనం పూర్తి చేసింది. ఇటు టూరిజంతో పాటు ట్రాఫిక్‌ సమస్యలు కూడా తొలగించవచ్చని భావిస్తుంది. నగర ప్రజల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

హైదరాబాద్‌లో రెండు కారిడార్‌లతో పాటు యాదాద్రిలో మరో కారిడార్‌ ఏర్పాటుపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేస్తోంది. ఈ మూడు మార్గాల్లో దాదాపు 17 కిలోమీటర్ల మేర రోప్‌వే నిర్మించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. అస్సాం, గుజరాత్‌ గిర్నార్, తూర్పు ముంబైలోని సెవ్రీ నుంచి ఎలిఫెంటా గుహల వరకు ఉన్న రోప్‌వే మార్గాల తరహాలోనే హైదరాబాద్‌లోనూ రోప్‌వే ఏర్పాటు చేయాలనుకుంటోంది.

50 నుంచి 150 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేసే ఈ రవాణా వ్యవస్థలో ఉండే ఒక్కో క్యాబిన్‌లో 8 మంది ప్రయాణికులు కూర్చొనే డిజైన్‌ను పరిశీలిస్తోంది. అలాగే కేబుల్‌ రిలే టవర్స్‌లో 30 మంది వరకు కూర్చొనేలా కూడా ఈ ప్రాజెక్టుపై కసరత్తు చేస్తోంది. సింగపూర్‌లో రహదారులపై ఏర్పాటు చేసిన రోప్‌వే మార్గం ఎలా ఉందనే దానిపై ఇప్పటికే అధ్యయనం చేసింది.

తెలంగాణలో ఒక హైదరాబాద్ లోనే కాకుండా జిల్లాల్లో కూడా పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారు భాగ్యనగరానికి రోప్ వే వస్తే మరింత పర్యాటకులను ఆకర్షించవచ్చంటున్నారు అధికారులు.

Tags:    

Similar News