TS Govt Schools: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు గుడ్‌న్యూస్
TS Govt Schools: ఈ పథకం ద్వారా 27,147 మంది విద్యార్ధులకు లబ్ధి
TS Govt Schools: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు గుడ్‌న్యూస్
TS Govt Schools: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా అల్పాహారాన్ని అందించేందుకు ముఖ్యమంత్రి అల్పాహార పథకంను రేపు లాంఛనంగా ప్రారంభించనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ప్రతీ నియోజకవర్గంలోని ఒక పాఠశాలలో రేపు ఈ కార్యక్రమాన్ని మంత్రులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తారని తెలిపారు. మిగిలిన పాఠశాలల్లో దసరా సెలవులు పూర్తికాగానే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి వివరించారు.
ఇందుకు సంబంధించి పాఠశాలల్లో మౌళిక సదుపాయాలను పెంపొందిస్తున్నామని పేర్కొన్నారు.ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు అల్ఫాహారాన్ని అందించనున్నామని అన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో హాజరుశాతం పెరిగి చదువు పట్ల శ్రద్ధ కలిగేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. పథకంఅమలు చేయడం ద్వారా 27 వేల147 పాఠశాలల్లోని దాదాపు 23 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుందని తెలిపారు.