Manappuram Gold Scam: మణప్పురం సంస్థలో లోన్ తీసుకుంటున్నారా..ఇంక అంతే!

Manappuram Gold Scam: రామచంద్రపురం మణప్పురం బ్రాంచ్‌లో నిర్వాహకుల చేతివాటంతో కస్టమర్లు గగ్గోలుపెడుతున్నారు.

Update: 2021-03-21 11:36 GMT

Manappuram Gold లోన్:( ఫైల్ ఇమేజ్)

Manappuram Gold Scam: ఆకస్మాత్తుగా వచ్చే కష్టాల నుంచి గట్టేక్కించడానికి మణప్పురం తలుపులు ఎప్పుడు తెరుచుకోని ఉంటాయి. ఏ ఆర్థిక అవసరమచ్చినా.. ఇంట్లో ఉన్న బంగారాన్ని తీసుకెళ్లి మణప్పురంలో తాకట్టుపెట్టి డబ్బులు తెచ్చుకొని అవసరాలు తీర్చుకుంటారు. ఇక మళ్లీ డబ్బులు సమకూరిన తర్వాత తిరిగి బంగారం రిటర్న్ తెచ్చుకుంటారు. ఇదంతా బాగానే ఉంది కానీ హైదరాబాద్‌ రామచంద్రాపురం మణప్పురం బ్రాంచ్ లో నిర్వాహకుల డబ్బు కక్కుర్తి బంగారాన్ని మాయం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పొంతన లేని సమాధానాలు...

ఓ వినియోగదారుడు వెళ్లి డబ్బులు చెల్లిస్తామని చెప్పినా.. గోల్డ్‌ రిటర్న్ ఇవ్వకుండా నిర్వాహకులు, సిబ్బంది పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తుంది. దీంతో కస్టమర్లు పోలీస్ స్టేషన్ బాట పట్టారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కోటి 9లక్షలు విలువజేసే గోల్డ్ ను సిబ్బంది తిరిగి తాకట్టుపెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు.

13 ఐటెమ్స్ పెడితే.. కేవలం 8 మాత్రమే...

మీరు ఎక్కువ వడ్డీ చెల్లించారు. మూడు నెలల వరకు రావద్దు అంటూ మేనేజర్ తెలిపినట్లు కస్టమర్లు చెబుతున్నారు. తిరిగి మళ్లీ మీ గోల్డ్ వేలం వేస్తున్నామని ఫోన్ రావడంతో బాధితుడు కంగారుగా బ్రాంచ్‌కు వస్తే అసలు విషయం బయట పడింది. మరో బాధితుడు 13 ఐటెమ్స్ పెడితే.. కేవలం 8 మాత్రమే ఉన్నాయని వాపోతున్నాడు.

మేనేజర్ రంజిత్ పై తీవ్ర ఆరోపణలు...

రామచంద్రపురం మణప్పురం మేనేజర్ రంజిత్ పై తీవ్ర ఆరోపణలు రావడంతో సంస్థ అతడిపై క్రిమినల్ కేసు పెట్టింది. దీంతో చాలా మంది కస్టమర్లు కంగారుపడి బ్రాంచ్‌ వద్దకు బారులుతీరుతున్నారు. ముందు డబ్బులు చెల్లించండి.. తర్వాత గోల్డ్ తీసుకెళ్లండి అంటూ నిర్వాహకులు చెబుతుండడంతో బాధితుల్లో మరింత అనుమానం పెరిగింది.

హెచ్‌ఎంటీవీని ఆశ్రయించిన బాధితులు...

బాధితులు గతంలో హెచ్‌ఎంటీవీని ఆశ్రయించడంతో హైదరాబాద్‌లోని రామచంద్రాపురం మణప్పురం గోల్డ్ లోన్‌ను సందర్శించింది మా బృందం. ఆ సమయంలో అక్కడి సిబ్బంది నుంచి లోపల జరిగే తతంగాన్ని బయటపెట్టించింది హెచ్‌ఎంటీవీ.

సంస్థను నమ్మామంటు బాధితులు ఆవేదన...

మోసం చేసిన మేనేజర్‌పై కేసు పెట్టామని తమకు సంబంధం లేదని ప్రస్తుత సిబ్బంది చెప్పడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. తాము మేనేజర్‌ని నమ్మలేదని మణప్పురం గోల్డ్ లోన్ సంస్థను నమ్మామంటు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తమ బంగారం ఎంత వరకు సేఫ్‌లో ఉందనే సంసిగ్ధంలో...

ఇప్పడు ఈ ఘటనతో ఎంతో మంది మణప్పురం గోల్డ్‌ లోన్ కస్టమర్స్ తమ బంగారం ఎంత వరకు సేఫ్‌లో ఉందనే సంసిగ్ధంలో ఉన్నారు. ఒక్క రామచంద్రపురం బ్రాంచ్‌లోనేనా.. మరేదైనా బ్రాంచ్‌లో ఇలాంటి మోసాలు జరుగుతున్నాయా.. అనే అనుమానం కస్టమర్స్‌ని వేధిస్తుంది. 

Tags:    

Similar News