Golconda Bonalu: గోల్కొండ జగదాంబికా అమ్మవారి రెండో బోనాల వేడుక
Golconda Bonalu: గోల్కొండ కోటకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు
Golconda Bonalu: గోల్కొండ జగదాంబికా అమ్మవారి రెండో బోనాల వేడుక
Golconda Bonalu: గోల్కొండ జగదాంబికా అమ్మవారి రెండో బోనాల వేడుకకు ఏర్పాట్లు చేశారు. గోల్కొండ కోటకు నగరంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలి రానున్నారు. వేల సంఖ్యలో బోనాలు, ఒడి బియ్యం సమర్పించనున్నారు. ఉదయం పటం వేయనున్నారు. ఆలయ పూజారులు ప్రత్యేక అర్చన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో శ్రీనివాసరాజు, పని వారాల సంఘం అధ్యక్షుడు సాయిబాబా చారి పేర్కొన్నారు.